అమీన్పూర్ /పటాన్చెరు, నవంబర్ 22 : సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం దాయరా పంచాయతీ పరిధిలో సర్వేనంబర్ 30 గల 720 ఎకరాల ఇనాం భూమిలో కొందరు కబ్జాదారులు వందకు పైగా ఎకరాల్లో అనుమతులు లేకుండా లేఔట్లు గీసి చిన్న చిన్న రూమ్ల నిర్మాణం చేపట్టి అమ్మకాలు ప్రారంభించారు. అమీన్పూర్ తహసీల్దార్ రాధ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ నాగరాజు, పోలీసుల భద్రత మధ్య శుక్రవారం అక్రమ కట్టడాలను కూల్చివేశారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. ఎవరైనా ఈ సర్వే నంబర్లో అనుమతులు లేకుండా నిర్మాణాలు చూపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కూల్చివేతల్లో ఆర్ఐ రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా ఇంద్రేశంలో శుక్రవారం పంచాయతీ కార్యదర్శి సుభాష్ ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. నవ్వ సెంట్రల్లో గోపాల్ అనే వ్యక్తి పర్మిషన్లు లేకుండా అదనపు అంతస్తులు నిర్మిస్తున్నారని గుర్తించి పంచాయతీ సిబ్బందితో కూల్చివేతలు జరిపారు. పంచాయతీ అనుమతులు లేని ఆరు నిర్మాణాలను గుర్తించామని, వాటిని తొలిగిస్తామని పంచాయతీ కార్యదర్శి తెలిపారు.