Telangana | హైదరాబాద్, అక్టోబర్14(నమస్తే తెలంగాణ): తెలంగాణ పల్లెల్లో దసరా వెలవెలబోయింది. ఈ సారి మద్యం అమ్మకాలతో ఖజానా నింపుకోవచ్చని భావించిన ఎక్సైజ్ అందకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసిం ది. ప్రతి డిపోలో కోటి కేసులకు తగ్గకుండా మద్యం అందుబాటులో ఉంచింది. అయితే, ఈసారి అంచనాలు తలకిందులయ్యాయి. ఈసారి ప్రజలు చుక్కను పక్కనపెట్టి ముక్కతోనే పనికానిచ్చారు. ఈసారి ఏకంగా 14 జిల్లాల్లో మద్యం విక్రయాలు గణనీయంగా పడిపోయాయి. ఈ జాబితాలో హైదరాబాద్ కూడా ఉంది. దసరా సమయంలో హైదరాబాద్‌లో మద్యం అమ్మకాలు ఈ స్థాయిలో పడిపోవడం గత పదేండ్లలో ఇదే తొలిసారి. దీంతో ఎక్సైజ్ కమిషనర్ విచారణకు ఆదేశించారు.
హైదరాబాద్‌లో మైనస్‌లోకి విక్రయాలు
ఎక్సైజ్ అధికారుల అంచనాల ప్రకారం ఏటా కనీసం 10 నుంచి 12 శాతం మద్యం విక్రయాలు పెరగాలి. గ్రేటర్ హైదరాబాద్‌కు ఏటేటా వలసలు పెరుగుతా యి కాబట్టి ఇక్కడ కనీసం 15 శాతానికి మించి లిక్కర్ సేల్స్ పెరగాలి. గడిచిన ఏడాది నిర్దిష్ట నెలలో జరిగిన మద్యం విక్రయాలను ప్రామాణికంగా తీసుకొని ఈ ఏడాది అదే నెలలో జరిగిన విక్రయాలతో సరిపోల్చుకొని సగటును లెక్కగడతారు. 19 జిల్లాల్లో ఎక్సైజ్ అధికారులు నిర్దేశించుకున్న అంచనాలు తప్పాయి. ఎక్సైజ్‌శాఖకు కీలక ఆదాయ వనరుగా ఉన్న ఉ మ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఈసారి దారుణంగా పడిపోయాయి.
వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, శంషాబా ద్, రంగారెడ్డి జిల్లాల్లో ఈ దసరాకు 20 నుంచి 25 శాతం మద్యం అమ్మకాలు పె రుగుతాయని ఎక్సైజ్ అధికారులు అంచ నా వేయగా, 10 శాతం కూడా పెరగలేదు. వికారాబాద్‌లో 7.9 శాతం, మేడ్చల్ 5.3 శాతం సరూర్‌నగర్‌లో 5 శాతం చొప్పున అతి స్వల్పంగా పెరగ్గా, మల్కాజిగిరిలో 0.95 శాతం, శంషాబాద్‌లో 2.75 శాతం మైనస్‌లోకి సెల్స్ పడిపోయాయి.
మూసీ పరీవాహక ప్రాంతంలో..
మూసీ పరీవాహక ప్రాంతం ఉన్న హైదరాబాద్ జిల్లాలో మద్యం విక్రయాలు పూర్తిగా పడిపోయాయి. ఇక్కడ మద్యం సేల్స్ మైనస్‌లోకి వెళ్లిపోయాయి. నిరుడు ఇదే దసరా పండగకు రూ 45.56 కోట్ల విలువైన మద్యం అమ్ముడు పోయింది. దీనికి కనీసం 15 శాతం అదనపు సేల్స్ కలుపుకొని ఈసారి రూ. 53 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోతుందని అంచ నా కట్టారు. ఆమేరకు మద్యం నిల్వలు సి ద్ధం చేసి పెట్టారు.
కానీ, ఎక్సైజ్ అధికారుల అంచనాలను తలకిందులు చేస్తూ రూ. 38.50 కోట్ల విలువైన మద్యమే అమ్ముడుపోయింది. ఈ లెక్కన గత విక్రయాలతో పోలిస్తే 15 శాతం మైనస్ విక్రయా లు జరిగినట్టు నిర్ధారించారు. సూర్యాపేట, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నిజామాబాద్ , ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, తదితర జిల్లాల్లో సేల్స్ పూర్తిగా పడిపోయా యి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో జీవ న ప్రమాణాలు తగ్గడం కూడా కారణమని ఓ అధికారి నమస్తే తెలంగాణకు తెలిపారు.