వనపర్తి, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : వనపర్తి ప్రజల్లోనూ హైడ్రా తరహాలో హడల్ మొదలైంది. జిల్లా కేంద్రానికి సమీపంలోని నల్లచెరువు నీళ్లు పట్టణంలోకి రాకుండా కట్టిన గోడను గురువారం జేసీబీతో అధికారులు కూలగొట్టారు. ఈ చెరువు పరిధిలో నిర్మాణాలు చేపట్టిన 9 మందికి, తాళ్ల చెరువు పరిధిలో నిర్మాణ యజమానులు ఆరుగురికి మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేయడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మున్సిపల్ అధికారుల అనుమతులతోనే నిర్మాణాలు చేపట్టామని వారు చెబుతున్నారు. తమున్సిపల్ కమిషనర్ పూర్ణచందర్‌ను సంప్రదించగా.. పట్టణం చుట్టూ ఉన్న నాలుగు చెరువులకు సంబంధించి సర్వే చేస్తున్నట్టు తెలిపారు. చిన్న గోడ మాత్రమే కూల్చామని, ఇంకా ఇండ్ల వరకు వెళ్లలేదని ఆయన పేర్కొన్నారు.