చౌటుప్పల్/బీబీనగర్/కేతేపల్లి/ అలంపూరు చౌరస్తా/దేవరకద్ర, జనవరి 11 : సంక్రాంతి సెలవులు రావడంతో హైదరాబాద్‌లో నివసించే వారు బస్సులు, కార్లు, ఇతర వాహనాల్లో సొంతూళ్లకు బయలుదేరడం తో శనివారం రహదారులు రద్దీగా మారాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విజయవా డ- హైదరాబాద్, హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారులు వాహనాలతో బారులుదీరాయి.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా, నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్ ప్లాజా, యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీతో ట్రాఫిక్ నెలకొన్నది. జో గుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం పుల్లూరు టోల్ ప్లాజా వద్ద 3 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. మహబూబ్‌నగర్ జిల్లా శాఖాపూర్ టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులుదీరాయి.