హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): నీటిలో మునిగిపోతున్న ముగ్గురు స్నేహితులను కాపాడి చేపల వలల చిక్కుకొని హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. నల్లగొండకు చెందిన కోడూరు అనూప్‌రెడ్డి(22) కుటుంబం హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ శివారు పెద్దఅంబర్‌పేటలో నివాసం ఉంటున్నది.
అనూప్‌రెడ్డి అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్నాడు. స్నేహితులతో కలిసి శుక్రవారం విహారయాత్రకు వెళ్లారు. టెక్సాస్ సమీపంలోని టోలెడోబెండ్ రిజర్వాయర్‌లోకి దిగిన ముగ్గురు స్నేహితులు మునిగిపోతుండటంతో అనూప్‌రెడ్డి వారిని కాపాడి ఒడ్డుకు చేర్చాడు. కానీ, అతని కాలు చేపలో వలలో చిక్కుకోవటంతో మృతిచెందాడు.