హైదరాబాద్ : రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు(Heavy rains) జన జీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాలకు పలు చోట్ల చెట్లు, కరెంట్ స్తంభాలు నేలకొరిగాయి. పంటలు దెబ్బతిన్నాయి.ఈ వరదలకు అనేక మంది ప్రజలు ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. ఈ క్రమంలో ఖమ్మం వరద బాధితులను (Flood victims) ఆదుకునేందుకుహైదరాబాద్ రేస్ క్లబ్ (Hyderabad Race Club)ముందుకొచ్చింది.
తనవంతు సాయంగా ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 2 కోట్లను విరాళంగా(Donation) అందజేసింది. మంగళవారం హైదరాబాద్ జూబ్లీహీల్స్లోని ముఖ్యమంత్రి నివాసంలో రూ.2 కోట్ల చెక్కును ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెకి రేస్ క్లబ్ డైరెక్టర్, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు శ్రీ రామసహాయం రఘురాంరెడ్డి, మరో డైరెక్టర్ నర్సింహా రెడ్డి అందజేశారు.