నమస్తే తెలంగాణ, నెట్వర్క్: ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు విస్త్రతంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో మంగళవారం నిర్వహించిన సోదాల్లో రూ.5 కోట్ల నగదుకుపైగా పట్టుబడింది.
సికింద్రాబాద్‌లో రూ.50 లక్షల నగదు, బంగారం, వెండి ఆభరణాలతోపాటు రూ.12.15 లక్షల విలువైన మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి. సంగారెడ్డి జిల్లాలో రూ.9.4 లక్షలు, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో రూ.6.50 లక్షలు, నిజామాబాద్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు వద్ద రూ.5.60 లక్షలు, పెద్దపల్లి జిల్లాలో రూ.3 లక్షలు, వనపర్తి జిల్లా కొత్తకోటలో రూ.2.35 లక్షలు, మహబూబ్‌నగర్ జిల్లాలో రూ.2 లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు.