హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): ‘గతంలో అక్రమ ఫోన్‌ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటు న్న సీపీ సజ్జనార్‌కు ఇప్పటి ఫోన్‌ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేతలను విచారించే అర్హ తే లేదు. ఈ కేసులో సిట్ అధికారిగా ఆయనను నియమించడం ఎంతవరకు సమంజసం’ అని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సంచలన ఆరోపణ లు చేశారు. ఆయనను వెంటనే సిట్ విచారణ బాధ్యతల నుంచి తప్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శుక్రవారం ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, పార్టీ నేతలు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, కురువ విజయ్, అభిలాశ్ రంగినేని, వాసుదేవరెడ్డితో కలిసి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మీడియాతో మాట్లాడారు.
2015లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్.. మరో ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ఓటు కొనుగోలు కోసం రూ.50 లక్షలు ఇవ్వబోయి పట్టుబడిన సందర్భంలో సజ్జనార్ ఎస్ఐబీ డీఐజీ గా ఉన్నారని తెలిపారు. ప్రస్తుత డీజీపీ శివధర్‌రెడ్డి ఆనాడు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బాధ్యతల్లో ఉన్నారని చెప్పారు. వీరిపై ఏపీలో కేసులు ఉన్నాయని ఆరోపించారు. తమ ఫోన్లు ట్యాప్ చేశారని ఆనాడు కొందరు రా జకీయ నాయకులు భవానీపురం, గుంటూ రు, కర్నూలు విశాఖపట్నం, పాయకరావుపేట, అలిపిరి పోలీస్స్టేషన్లలో సజ్జనార్‌పై ఫిర్యాదులు చేయగా, కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సజ్జనార్‌ను ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ రెండో సిట్‌కు విచారణాధికారిగా నియమించడం ఎంతవరకు సమంజసమ ని ప్రశ్నించారు. అక్రమ కేసులకు బీఆర్ఎస్ బెదరబోదని, పోరాటం ఆపబోదని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తేల్చిచెప్పారు.
సర్కార్‌ది రాక్షసానందం
సిట్ విచారణల పేరిట సీఎం రేవంత్‌రెడ్డి వికృత రాజకీయ క్రీడకు తెరలేపారని ఆర్ఎస్పీ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సర్కార్ స్కామ్‌లను వెలికితీసి, వాటిపై నిరంతరం ప్రశ్నిస్తున్న కేటీఆర్, హరీశ్‌రావుపై అక్రమ కేసులు బనాయించి రాక్షసానందం పొందుతున్నారని ధ్వజమెత్తారు. ఫోన్‌ట్యాపింగ్ నేరం కాదని.. దేశ, రాష్ట్రాల భద్రతకు గూఢచర్యంలో ఒక భాగమేనని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ స్పష్టంచేశారు.