Rain Update | హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): ఆవర్తనం ప్రభావంతో రానున్న మూడు రోజులపాటు రాష్ట్రం లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని హైదరాబాద్ వాతావరణ కేం ద్రం వెల్లడించింది. సాయంత్రం త ర్వాత వానలు పడొచ్చని తెలిపింది. హైదరాబాద్‌లో మాత్రం మోస్తరు వ ర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గడిచిన 24 గంటల్లో మహబూబాబాద్‌లోని గంగవరంలో అత్యధికంగా 6.86 సెంటీమీటర్ల వాన పడిందని వెల్లడించింది. ఈ నైరుతి సీజన్లో ఇప్పటివరకు రాష్ట్రంలో 364 మిల్లీమీటర్ల వర్షం కురువాల్సి ఉండగా 461 మిల్లీమీటర్లు కురిసిందని పేర్కొంది.