హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): ఇటీవల ఇంటర్న్షిప్ వైపు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ఒకవైపు చదుకుంటూనే మరోవైపు నైపుణ్యాన్ని మెరుగుపర్చుకుంటూ, పారితోషికాన్ని ఆర్జించేందుకు ఇంటర్న్షిప్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. గత ఐదేండ్లల్లో దేశంలో ఇంటర్న్షిప్స్ 200 శాతం పెరుగుదలను నమోదుచేశాయి. వీటిలో 23 శాతం ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్లే కావడం విశేషం. హైదరాబాద్ ఇంటర్న్షిప్ వాటా కేవలం 3 శాతం మాత్రమే. రాష్ర్టాల వారీగా తీసుకుంటే ఢిల్లీ 34 శాతంతో ముందంజలో ఉండగా, ముంబై 16, బెంగళూరు 10 శాతంతో టాప్-3 స్థానాల్లో ఉన్నాయి. పుణె 5, హైదరాబాద్, జైపూర్ 3 శాతం ఇంటర్న్షిప్ వాటానే కలిగి ఉన్నాయి. ఈ ఆసక్తికరమైన ఈ విషయాలను ఇంటర్న్షాలా తన వార్షిక నివేదికలో వెల్లడించింది.