వ్యవసాయ విశ్వవిద్యాలయ భూములను హైకోర్టుకు కేటాయించవద్దంటూ శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థుల పట్ల పోలీసులు కర్కశంగా ప్రవర్తించడాన్ని, ఝాన్సీ అనే విద్యార్థినిని జుట్టు పట్టి ఈడ్చుకెళ్లడాన్ని హైకోర్టు పరిరక్షణ సమితి ఖండించింది.
వర్సిటీ భూముల పరిరక్షణ కోసం కృషిచేస్తున్న విద్యార్థులకు సమితి నాయకులు గుండ్రాతి శారదాగౌడ్, మామిడి వేణుమాధవ్, వెంకటేశ్వరప్రసాద్, మణికంఠ, బర్ల మల్లేశ్‌యాదవ్, కృష్ణముదిరాజ్, రమేశ్ మాదిగ తదితరులు సంఘీభావం ప్రకటించారు.