Agricultural Conferences | నేడు హైదరాబాద్ వేదికగా వ్యవసాయంపై కీలక సదస్సులు..రాజేంద్రనగర్లో కూరగాయల పంటలపై సదస్సు
హైదరాబాద్ రెండు అత్యంత కీలకమైన వ్యవసాయ సదస్సులకు వేదికగా మారింది. ఈనెల 20 నుంచి 22 వరకు రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాల ప్రాంగణంలో కూరగాయల సాగుపై అఖిల భారత సమన్వయ సదస్సు, ఎన్టీఆర్ స్టేడియంలో అత్యంత పెద్ద అగ్రి షో జరుగనున్నాయి.
- రాజేంద్రనగర్లో కూరగాయల పంటలపై సదస్సు
- ఎన్టీఆర్ స్టేడియంలో రైతుబడి ఆధ్వర్యంలో అగ్రి షో
హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ రెండు అత్యంత కీలకమైన వ్యవసాయ సదస్సులకు వేదికగా మారింది. ఈనెల 20 నుంచి 22 వరకు రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాల ప్రాంగణంలో కూరగాయల సాగుపై అఖిల భారత సమన్వయ సదస్సు, ఎన్టీఆర్ స్టేడియంలో అత్యంత పెద్ద అగ్రి షో జరుగనున్నాయి. రాజేంద్రనగర్లో కూరగాయ పంటలపై అఖిల భారత సమన్వయ పరిశోధన పథకంపై సమావేశాలను భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ డైరెక్టర్ జనరల్ సంజయ్కుమార్సింగ్ ప్రారంభించనున్నారు. వివిధ దేశాల శాస్త్రవేత్తలతోపాటు దేశంలోని అన్ని ఉద్యాన విశ్వవిద్యాలయాలు కూరగాయల విత్తనోత్పత్తిపై చేసిన పరిశోధనలను వెల్లడించనున్నారు.
300 మంది శాస్త్రవేత్తలు ఒకే దగ్గర సమావేశమై, భవిష్యత్తులో దేశంలో కూరగాయల దిగుబడులను పెంచడానికి అనుసరించాల్సిన విధానాలు వెల్లడించనున్నారు. ఎన్టీఆర్ స్టేడియం వేదికగా రైతుబడి ఆధ్వర్యంలో అతి పెద్ద వ్యవసాయ ఎగ్జిబిషన్ జరుగనున్నది. వివిధ రాష్ర్టాల నుంచి 3వేల మంది రైతులు, వివిధ వ్యవసాయ పరికరాల ఎగ్జిబిటర్లు పాల్గొననున్నారని రైతుబడి నిర్వాహకులు జూలకంటి రాజేందర్రెడ్డి తెలిపారు. ఎగ్జిబిషన్ను శుక్రవారం ఉదయం 10 గంటలకు తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ప్రారంభిస్తారని వెల్లడించారు. నూతన యంత్రాలు, ఏఐ టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీ, విత్తనాలు, మొక్కలు, ఎరువులు, డ్రిప్ పరికరాల వంటివి ఎన్నో ప్రదర్శనకు వచ్చినట్టు చెప్పారు. సందర్శకులు www.rbagrishow.com ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చని, నేరుగా హాజరుకావచ్చని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

