Telangana | బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై హైదరాబాద్ యూత్ ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన అద్భుతమని, కేటీఆర్ ఐటీ రంగాన్ని ఎంతో అభివృద్ధి చేశారని కొనియాడారు. కేటీఆర్ సారథ్యంలో ఏర్పడిన ఐటీ హబ్ అద్భుతం అని ప్రశంసించారు. ఐటీ కంపెనీలు భారీగా తరలిరావడంతో, డిగ్రీ అయిపోయి, స్కిల్స్ ఉంటే ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని యూత్ పేర్కొన్నారు. హైదరాబాద్ అభివృద్ధి, ఐటీ కంపెనీలపై ముషీరాబాద్ నియోజకవర్గం యువకుల అభిప్రాయం ఇది.
ప్రధానంగా ఇవాళ హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఇష్యూ లేదు. రోడ్లు బాగా అభివృద్ధి చేశారు. ఎంబీఏ కంప్లీట్ అయింది.. ఎంఎన్సీ కంపెనీలో పని చేస్తున్నాను.. ఐటీ సెక్టార్లో రిక్రూట్మెంట్ బాగుంది. విప్రో, కాగ్నిజెంట్, హెచ్‌సీఎల్ వంటి కంపెనీల్లో జాబ్‌లు వస్తున్నాయి. ఐటీ హబ్ బాగుంది. డిగ్రీ, ఇంటర్ తర్వాత కూడా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. 24 గంటల కరెంట్‌తో ఉపాధి అవకాశాలు పెరిగాయి. వాటర్ సమస్య కూడా లేదు. గతంలో కరెంట్ సమస్య ఉండే.. సమస్య పరిష్కారం ఫోన్ చేస్తే గంటకు వచ్చేటోళ్లు. హైదరాబాద్‌ను మరింత ఇంప్రూవ్ చేయాలని కోరుకుంటున్నాం. ప్రెజెంట్ గుడ్, ఎక్సలెంట్. హైలెవల్‌కు తీసుకెళ్తే ఫాబ్యులస్. మొత్తంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ బెటర్‌గా ఉంది.
టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా బాగా పని చేసింది. కేటీఆర్ చాలా డెవలప్మెంట్ చేశారు హైదరాబాద్‌ను. కేటీఆర్ లాంటి లీడర్ మా దగ్గర ఎందుకు లేరని ఆంధ్రావాళ్లు అనుకుంటున్నారు. ఈ విషయాన్ని మా ఫ్రెండ్స్ చెప్పారు. తెలంగాణలో మేం ఎందుకు పుట్టలేదని అనుకుంటున్నారట. కేటీఆర్ వర్క్స్ బాగున్నాయని ప్రశంసిస్తున్నారు. తెలంగాణలో బాగా డెవలప్మెంట్ జరుగుతుంది.
కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, ఆసరా పెన్షన్లు ఇస్తున్నారు. అంతకుముందు గవర్నమెంట్లో పెన్షన్లు వస్తయో, రావో తెలియని పరిస్థితి. ఇప్పుడు నెల నెల అన్ని అందుతున్నాయి. వేరే గవర్నమెంట్ వస్తే మళ్లీ చేంజ్ అవుతది. రైతులకు బీఆర్ఎస్ గవర్నమెంట్ అన్ని రకాలుగా అండగా ఉండి, ఆదుకుంటుందిఅని యూత్ పేర్కొన్నారు.