హైదరాబాద్: హైదరాబాద్‌లో దిగాల్సిన ఇండిగో విమానాన్ని ఎయిర్ ట్రాఫిక్ కారణంగా (Air Traffic) విజయవాడకు మళ్లించారు. గంటా 20 నిమిషాల్లో గమ్యాస్థానికి చేరుకోవాల్సిన విమానం మూడు గంటలు ఆల్యంగా వచ్చింది. ఇండిగో 6E-6473 విమానం పుణె నుంచి హైదరాబాద్‌కు వస్తున్నది. ఆదివారం ఉదయం 8.43 గంటలకు పుణె విమానాశ్రయం నుంచి బయల్దేరింది.
ఉదయం 10 .03 గంటలకు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. అయితే హైదరాబాద్ గగణతలంలో భారీగా ఎయిర్ ట్రాఫిక్ (Hheavy Air Traffic) ఉండటంతో ల్యాండింగ్ కుదరలేదు. దీంతో విమానాన్ని విజయవాడకు మళ్లించారు. రెండు గంటల తర్వాత అంటే మధ్యాహ్నం 12.38 గంటలకు శంషాబాద్‌కు చేరుకుంది. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.