హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): యుద్ధం హార్డ్‌వేర్ నుంచి సాఫ్ట్వేర్ వైపు మారుతున్నదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చెప్పా రు. గచ్చిబౌలిలో శుక్రవారం వివిధ రక్షణ సంస్థలు నిర్వహించిన విజ్ఞాన్ వైభవ్-2025 కార్యక్రమంలో రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడారు. కొత్త సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్, మెషిన్ లెర్నిం గ్, క్లీన్ టెక్ వంటి విప్లవాత్మక సాంకేతిక వ్యవస్థలో ఇండియా కూడా ముందుండాలని, ఆ దిశగా రాబోయే ఇంజినీర్లు దృష్టిసారించాలని కోరారు.
ప్రస్తుతం దేశ భద్రత ఆధునిక సాంకేతికతపై కూడా ఆధారపడి ఉన్నదని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశ రక్షణ రంగానికి హైదరాబాద్, బెంగళూరు ముఖ్యకేంద్రాలుగా ఉన్నాయని, ఈ రెండింటినీ కలిపి డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌గా ప్రకటించాలని అన్నారు. కార్యక్రమంలో 30 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. డీఆర్డీఓ నుంచి 200కు పైగా స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ సైన్స్ ఎగ్జిబిషన్లో రక్షణశాఖకు చెందిన పలు రాకెట్లు, అంతరిక్ష పరికరాలు, యుద్ధ ట్యాంకులు ప్రదర్శించారు.
అధికారిక కార్యక్రమాల్లో సైతం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేరు మర్చిపోవడం ఆనవాయితీగా మారింది. శుక్రవారం డీఆర్డీఓ, ఇతర రక్షణ సంస్థల ఆధ్వర్యంలో జరిగిన సైన్స్ ఎగ్జిబిషన్లో కూడా యాంకర్ సీఎం పేరు మర్చిపోయారు. స్డేడియంలో ఉన్న విద్యార్థులకు అభివాదం చేసేందుకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, సీఎం రేవంత్‌రెడ్డి పరేడ్ వాహనంలో ఆశీనులవ్వగా.. యాంకర్ మాట్లాడుతూ.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను పరిచయం చేసిశారు.
అనంతరం ఓ ఫ్లోలో మాట్లాడుతూ.. ‘థాంక్యూ సోమచ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ..’ అంటూ తడబడి పేరు మర్చిపోయారు. ఇదే వేదికపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతూ.. ‘తెలంగాణ చీఫ్ మినిస్టర్ శ్రీ ఏ రేవ్నాథ్జీ రెడ్డి’ అంటూ పేరును తప్పుగా పలికారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏం చేయాలో పాలుపోక గంభీరంగా చూశారు.