ఈటల రాజేందర్ మీరు రాజీనామా చేసినప్పటి నుంచి రోజుకో విధంగా మాట్లాడుతున్నారు. మీరు చేసే పనుల్లో నిబద్ధత, నిజాయితీ లేదు. పూర్తిస్థాయి బీజేపీ, ఆర్ఎస్ఎస్ భక్తునిలా మారిపోయి, పచ్చి అబ్దదాలు మాట్లాడతున్నారు. పచ్చకామెర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగనే కనిపించినట్లుగా మీరు గవర్నమెంట్ ఏది చేసినా కూడా అది మీ వల్లనే అయితది అన్నట్లు భ్రమలో ఉన్నారు. మీరు రాక ముందు కళ్యాణలక్ష్మి లేదా? రైతుబంధు, రైతుబీమా, ఆసరా పెన్షన్లు, షాదీ ముబాకర్ లేదా? దళిత బంధు పథకం మీరు శాసనసభలో ఉన్నప్పుడే ప్రకటించారు. నిండు సభలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. ఇవాళ పచ్చి అబద్దాలు మాట్లాడుతూ.. మోదీ, అమిత్‌షాను మించిపోయారు.
మీ అబద్దాలను చూసి హుజూరాబాద్ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. మీ అబద్దాలను చూసి ఇన్ని రోజులు టీఆర్ఎస్లో కొనసాగినా రాజేందరేనా మన ముందు ఉన్నది అని అనుకుంటున్నారు. ఇప్పటికైనా మీరు పేద ప్రజల పక్షాన నిలబడాలి. ప్రభుత్వ పథకాలను సమర్థించండి. సమర్థించకపోయినా సరే కానీ విమర్శించకండి. నిరుపేదలైన దళితులకు దళిత బంధు రావొద్దా? మీరు ఒక్కరే మంచిగా ఉండాలా? దుర్బుద్ధితో ఆలోచించకండి. మీరు బుద్ధి మార్చుకున్నా.. మార్చుకోకపోయినా మిమ్మల్ని హుజూరాబాద్ ప్రజలు తప్పకుండా ఓడిస్తారు.
-పోతరవేణి అనిల్ కుమార్ ( బోర్నపల్లి, హుజూరాబాద్ మండలం )