ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదు. ఆయన మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఏ తప్పు చేయని వ్యక్తి అయితే ప్రభుత్వానికి సహకరించి నిరూపించుకోవాల్సి ఉండే. రాజీనామా ఎవరు చేయమని చెప్పారు. ఆత్మగౌరవం దెబ్బతిన్నదని చెప్పి.. రాజీనామా చేసిండు. రాజయ్య మీద ఆరోపణలు వచ్చినప్పుడు ప్రభుత్వానికి సహకరించి.. ఎమ్మెల్యేగా కొనసాగుత లేడా? వామపక్ష భావజాలం ఉన్న మీరు.. బీజేపీలోకి ఎందుకు వెళ్లారు? ఆర్థిక నేరస్తులకు అడ్డాగా మారిన బీజేపీలోకి మీరు వెళ్లారంటే.. మీరు అవినీతి చేసినట్టే కదా? ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన కేసీఆర్‌ను విమర్శిస్తావా? కేసీఆర్ మీకు ఎన్నో పదవులు ఇచ్చారు. హరీశ్‌రావును కాదని మీకు ఫ్లోర్ లీడర్ పదవి ఇచ్చిండు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కీలకమైన ఆర్థిక శాఖ ఇచ్చిండు. ఆ తర్వాత కీలమైన ఆరోగ్య శాఖను మీ చేతిలో పెట్టిండు. అప్పుడు గుర్తుకు రాలేదా.. దొరల పార్టీ అని. ఈటల రాజేందర్‌ను తప్పకుండా ఓడిస్తాం. – ఎండీ రియాజ్, హుజూరాబాద్
కేసీఆర్ సీఎం అయిన తర్వాత సాగునీరుకు సమస్య లేదు. రైతు బంధు అందించి రైతులను ఆదుకుంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు ఎంతో లాభపడుతున్నారు. ఈటల రాజేందర్ వల్ల ఏం కాదు. ఏం చేస్తడో కూడా తెల్వదు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్‌కే ఓటేస్తాం. – వంశీ రెడ్డి