ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ వందకు పైగా పథకాలను అమలు చేస్తున్నారు. ఈటల రాజేందర్ చేసిన అభివృద్ధి ఏం లేదు. ఈటల ఏడ్సినా శూన్యమే.. ఆయనను కచ్చితంగా ఓడిస్తాం. ఒక వేళ ఆయన గెలిస్తే ఏం చేస్తరో చెప్పాలి? టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు ఖాయం. ఆయనను భారీ మెజార్టీతో గెలిపిస్తాం. -తాళ్లపెళ్లి రాజేందర్ ( జూపాక గ్రామం )
సీఎం కేసీఆర్ గౌడ కులస్తులను ఆదుకుంటున్నారు. తమ అభివృద్ధిని కాంక్షించిన సీఎం కేసీఆర్.. పన్నును రద్దు చేశారు. కేసీఆర్ ప్రకటించిన గెల్లు శ్రీనివాస్ యాదవ్కు ఓటేయ్యాలని గౌడ సంఘం తీర్మానం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు సాగునీరును అందిస్తున్నారు. –తాళ్లపల్లి శ్రీనివాస్, గీత కార్మిక సంఘం అధ్యక్షుడు ( రాంపూర్ గ్రామం )