ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఉండి, రెండుసార్లు మంత్రి పదవి అనుభవించిన ఈటల ఇవాళ బీజేపీలో చేరి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. దళిత బంధు, రైతు బంధు, రైతుబీమా, ఆసరా పెన్షన్ల వంటి ఎన్నో సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారు. ఈ ప్రాంతాన్ని ఈటల రాజేందర్ అభివృద్ధి చేయలేదు. మంజూరైన 4 వేల డబుల్ బెడ్రూం ఇండ్లను పూర్తి చేయని ఈటల రాజేందర్‌కు హుజూరాబాద్ ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. రైతులను ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. ప్రతీ కుటుంబానికి టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. యువకుల నుంచి వృద్ధుల వరకు అందరూ టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటున్నారు.
– జవాజి అనిల్ ( సిరిసేడు గ్రామం, ఇల్లందకుంట మండలం )
గత ప్రభుత్వాలు గొల్లకుర్మలను పట్టించుకోలేదు. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ కార్యక్రమం అద్భుతంగా ఉంది. గొర్రెల పంపిణీతో తమ కుటుంబాలు బాగుపడుతున్నాయి. ఆర్థికంగా కూడా ఎదుగుతున్నాం. ప్రజలందరూ అభివృద్ధి బాటలో పయనించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. ఎల్లవేళలా కేసీఆర్ సార్‌కు అండగా ఉంటాం. – మర్రి శ్రీధర్ ( కోర్కల్ గ్రామం, వీణవంక మండలం )