Padi Kaushik Reddy | ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేత హరీశ్‌రావుపై అక్రమ కేసులు పెట్టడం అప్రజాస్వామికం అని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి ఏడాది పాలన వైఫల్యాలను ఆధారాలతో సహా ఎండగట్టిన హరీశ్ రావును భయపెట్టే ప్రయత్నం చేయడం కక్షపూరిత చర్య అని మండిపడ్డారు.
అణచివేత మీ విధానం అయితే, ఎదిరించడం మా నైజం అని పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. నిర్బంధాలు, ఆంక్షలు, కంచెలు కాంగ్రెస్ పరిపాలనలో నిత్య కృత్యమయ్యాయని విమర్శించారు. నీ తాటాకు చప్పులకు బీఆర్ఎస్ భయపడదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి నిన్ను అడుగడుగునా నిలదీస్తూనే ఉంటాం.. ఖబర్దార్ అని హెచ్చరించారు. ప్రజా క్షేత్రంలో పాలన వైఫల్యాలను బట్టబయలు చేస్తూనే ఉంటామని అన్నారు.
మాజీ మంత్రి హరీశ్ రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మంగళవారం కేసు నమోదైంది. తన ఫోన్‌ను ట్యాపింగ్ చేశారని సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ జూబ్లీహిల్స్ ఏసీపీకి మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హరీశ్‌రావుపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన రాధాకిషన్ రావుపై కూడా కేసు నమోదైంది. 120 (బీ), 386,409,506 , రెడ్ విత్ 34, ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే హరీశ్‌రావు మీద పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి మీద 10కిపైగా కేసులు ఉన్నాయని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీశ్ రెడ్డి వెల్లడించారు. అలాంటి వ్యక్తితో ఫిర్యాదు చేయించి.. ఈ రోజు కేసు నమోదు చేసి అరెస్టు చేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని విమర్శించారు. చక్రధర్ గౌడ్ మీద వివిధ స్టేషన్లలో ఉన్న కేసుల వివరాలను ట్విట్టర్(ఎక్స్) వేదికగా బయటపెట్టారు.
1.Criminal Conspiracy and Counterfeiting
Cr. No.: 157/2006
Sections: 120-B, 489 A, B, C, D IPC
Police Station: Town-II, Siddipet, Telangana
2.Cyber Fraud and Cheating*
Cr. No.: 198/2014
Sections: 66(C & D) IT Act 2008 & 420 IPC
Police Station: Cyberabad Cyber Crime PS
3.Voluntarily Causing Hurt*
Cr. No.: 186/2018
Sections: 324 r/w 34 IPC
Police Station: Bachupally PS, Cyberabad
http://4.House Trespass, Assault, and Outraging Modesty*
Cr. No.: 141/2019
Sections: 448, 323, 509 r/w 34 IPC
Police Station: Bachupally PS
5.Rash Driving and Epidemic Act Violation*
Cr. No.: 217/2020
Sections: 279, 188, 269 IPC, 3 EDA, 185 MV Act
Police Station: Sanathnagar PS
6.Attempt to Commit Rape*
Cr. No.: 49/2023
Sections: 376, 511 IPC
Police Station: Shameerpet PS, Cyberabad
7.Robbery and Attempted Kidnapping*
Cr. No.: 522/2023
Sections: 392, 363 r/w 511 & 34 IPC
Police Station: Ghatkesar PS, Rachakonda
8.Joint Cybercrime Investigation*
Cr. No.: 909/2023 and 908/2023
Sections: Cybercrime-related offenses
Investigating Agencies: Task Force and Cyber Crime Police
Court: 12th Metropolitan Court, Nampally