హుజురాబాద్ : ఉపఎన్నిక ఓట్ల లెక్కింపులో ప్రస్తుతం ఆరో రౌండ్ పూర్తయింది. టీఆర్ఎస్ అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 1017 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. టీఆర్ఎస్కు 3,639 ఓట్లు రాగా.. బీజేపీకి 4, 656 ఓట్లు వచ్చాయి. ఈ ఉప ఎన్నికలో ఏమాత్రం ప్రభావం చూపని కాంగ్రెస్కు ప్రతి రౌండ్లోనూ కేవలం 200 లోపు ఓట్లు మాత్రమే వస్తున్నాయి. ఆరో రౌండ్లో కాంగ్రెస్కు కేవలం 180 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆరో రౌండ్ ముగిసే సరికి బీజేపీకి 1017 లీడ్ ఉండగా.. మొత్తానికి 3,186 మెజార్టీతో మొదటిస్థానంలో ఉంది.