హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారానికి బుధవారం సాయంత్రం తెరపడింది. ప్రచారం ముగియడంతో స్థానికేతరులను అధికారులు హుజూరాబాద్ నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈటల రాజీనామాతో మొదలైన ఉప ఎన్నిక ప్రచారం సమాప్తం కావడంతో నియోజకవర్గంలో ఒక్కసారిగా నిశబ్ధం అలుముకున్నది. ప్రతి ఎన్నికకు 48 గంటల ముందు నిలిపి వేసే ప్రచారాన్ని ఈ ఎన్నికల్లో మాత్రం 72 గంటల ముందు నిలిపి వేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికలు సజావుగా జరిగేందుకు పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. కేంద్ర బలగాలు కూడా తోడవడంతో ఎక్కడికక్కడ తనిఖీలు ముమ్మరం చేశారు.