అమీన్పూర్, నవంబర్ 9 : కట్టుకున్న భార్యను కడతేర్చాడు ఓ భర్త. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఆదివారం చోటుచేసుకున్నది. ఇన్స్పెక్టర్ నరేశ్ కథనం ప్రకారం.. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కేఎస్ఆర్ కాలనీలో కృష్ణవేణి (32), బ్రహ్మయ్య దంపతులు నివాసం ఉంటున్నారు. కృష్ణవేణి కోహిర్ మండలంలోని డీసీసీ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నది. కృష్ణవేణి వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానం పెంచుకున్నాడు.ఈ విషయమై ఆదివారం ఉదయం భార్యాభర్తలు గొడవపడ్డారు. క్షణికావేశంలో బ్రహ్మయ్య భార్యపై బ్యాట్‌తో దాడిచేసి హతమార్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహానికి పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు ఇన్స్పెక్టర్ నరేశ్ తెలిపారు.