కట్టుకున్నోడే కడతేర్చాడు.. కోరుట్లలో గర్భిణి హత్య
ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నానని చెప్పి పెండ్లి చేసుకున్న ఓ ప్రబుద్ధుడు వరకట్నం కోసం నాలుగు నెలల గర్భిణీని కడతేర్చిన ఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగింది.
- హతురాలు యూట్యూబర్
కోరుట్ల రూరల్/ కోరుట్ల, మార్చి 17: ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నానని చెప్పి పెండ్లి చేసుకున్న ఓ ప్రబుద్ధుడు వరకట్నం కోసం నాలుగు నెలల గర్భిణీని కడతేర్చిన ఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగింది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్ల మండలం మాదాపూర్కు చెందిన గంధం ప్రసాద్, రాణి దంపతుల కూతురు వైష్ణవి (20)కి, కోరుట్ల పట్టణం ఏస్కోనిగుట్ట కాలనీకి చెందిన చిత్తరి హరిబాబుకు ఎనిమిది నెలల క్రితం వివాహమైంది. వైష్ణవితో వివాహం హరిబాబు కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. వారిని ఇంట్లోకి అనుమతించక పోవడంతో మాదాపూర్లోని అత్తగారింటిలో భార్య వైష్ణవితో హరిబాబు కాపురం పెట్టాడు.
వైష్ణవి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ భర్తతో కలిసి రీల్స్ చేస్తూ యూట్యూబ్లో అప్డోల్ చేస్తుంటుంది. హరిబాబు కోరుట్లలోని ప్రభుత్వ దవాఖానలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇటీవల కోరుట్లలోని తన ఇంటికి భార్యతో వెళ్లిన హరిబాబును కుటుంబసభ్యులు దూషించి మళ్లీ ఇంటికి రావద్దని కండ్లలో కారం చ ల్లారు. ఇదే విషయమై సోమవారం భా ర్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఉదయాన్నే హరిబాబు ఆదరాబాదరగా బైక్పై వెళ్లిపోయాడు. గదిలోకి వెళ్లి చూడ గా కూతురు రక్తపు మడుగులో పడి ఉన్న ది. వైష్ణవిని దవాఖానకు తరలించగా అ ప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

