Siddipet | సిద్దిపేట జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన భార్య గొంతు కోశాడు. అడ్డొచ్చిన కుమార్తెపైనా రోకలి బండతో దాడి చేశాడు.
వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట పట్టణంలోని ఆదర్శనగర్లో నివాసం ఉంటున్న ఎల్లయ్యకు అతని భార్య శ్రీలత (40)కి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ కుటుంబ కలహాల కారణంగా ఆగ్రహానికి గురైన ఎల్లయ్య శ్రీలత గొంతు కోశాడు. అడ్డొచ్చిన కుమార్తె అర్చనపైనా రోకలి బండతో దాడి చేశాడు. క్షణికావేశంతో భార్యను హత్య చేసినప్పటికీ.. ఆ తర్వాత భయపడిపోయిన ఎల్లయ్య తాను కూడా గొంతు కోసుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. గాయాలతో ఉన్న ఎలయ్య, అర్చనను ఆస్పత్రికి తరలించారు.