అప్పులు మిగిల్చిన విషాదం
అప్పల బాధలు తాళలేక మనస్తాపంతో భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసి.. ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన వనపర్తి జిల్లాలో బుధవారం చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్ర కారం.. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూరు గ్రామానికి చెందిన గం గల నర్సింహులు(40)కు భార్య ఎల్లమ్మ (36), కుమారుడు సాయి నిహాల్ (15), కూతురు సాహితీశ్రీ(13) ఉన్నారు.
- భార్య, ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త
- వనపర్తి జిల్లా సల్కలాపూర్ శివారులో విషాద ఘటన
ఖిల్లాఘణపురం, మే 27: అప్పల బాధలు తాళలేక మనస్తాపంతో భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసి.. ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన వనపర్తి జిల్లాలో బుధవారం చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్ర కారం.. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూరు గ్రామానికి చెందిన గం గల నర్సింహులు(40)కు భార్య ఎల్లమ్మ (36), కుమారుడు సాయి నిహాల్ (15), కూతురు సాహితీశ్రీ(13) ఉన్నారు. నర్సింహులు వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలం సల్కలాపూర్ గ్రామ శివారులో మామిడి తోటలను లీజుకు తీసుకొని వ్యా పారం చేశాడు.
రూ.70 లక్షలకు పైగా అ ప్పులు చేశాడు. అప్పుల బాధలు ఎక్కువ కావడంతో మనోవేదనకు గురై భార్య, పిల్లలను చంపాలని నిర్ణయించుకున్నాడు. మంగళవారం భార్య, కూతురిని మామిడి తోటలో చంపి నీటి సంపులో పడేశాడు. ఇదంతా చూసిన కొడుకు నిహాల్ కాళ్లు, చేతులకు తాళ్లు కట్టి సంపులో పడేసి హత్య చేశాడు. అర్ధరాత్రి తన బావమరిది వెంకటేశ్‌కు ఫోన్ చేసి ‘మీ అక్క, పిల్లలను చంపే శా.. నేను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నా’ అని ఉరేసుకున్నాడు. డీఎస్పీ గిరిబాబు, సీఐ శ్రీనివాసులు, ఎస్సై వెంకటేశ్ ఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. నర్సింహులు బావమరిది వెంకటేశ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

