హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీలో రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం గురువారం బస్‌భవన్ ఎదుట ‘ఉపవాస దీక్ష’ చేపట్టనున్నట్టు తెలంగాణ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సారథ్య కమిటీ బాధ్యుడు పట్టాభి లక్ష్మయ్య తెలిపారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు.
కార్యక్రమానికి సుమారు 10వేల మంది రిటైర్డ్ ఉద్యోగులు హాజరుకానున్నట్టు వెల్లడించారు. ఆర్పీఎస్ 2017, 2021 ఏరియర్స్, లీవ్ ఎన్క్యాష్మెంటు, గ్రాట్యుటీ బకాయిలు తదితర ఎన్నో సమస్యలు ఉన్నట్టు వాపోయారు. సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులకు పలుమార్లు వినతులు ఇచ్చినా స్పందనలేదని, అందుకే ఉపవాస దీక్షలు చేపడుతున్నట్టు వివరించారు.