నర్సంపేట, ఆగస్టు15 : దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ ప్రతిష్ఠాపన వివాదంలో పోలీసులు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌తోపాటు బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా సర్వాపురం శివారులోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎదుట పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని బీఆర్ఎస్ శ్రేణులు ఆవిష్కరించారు.
పోలీసుల విధులను అడ్డుకున్నందుకు, మున్సిపాలిటీ అనుమతి లేకుండా విగ్రహాన్ని ప్రతిష్ఠించినందుకు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, బీఆర్ఎస్ నేతలు శీలం వీరన్న, రాయిడి దుశ్యంత్‌రెడ్డి, సంగని సూరయ్య, దోనాల రవిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై అరుణ్‌కుమార్ తెలిపారు.