హైదరాబాద్, ఫిబ్రవరి7(నమస్తే తెలంగాణ) : మహబూబాబాద్ జిల్లా దామరవంచ గిరిజన గురుకులంలో ఫుడ్ పాయిజన్ జరిగి, విద్యార్థులు దవాఖాన పాలుకావడం సర్కారు నిర్లక్ష్యానికి పరాకాష్ట అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో వందల్లో సంఖ్య లో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయని శుక్రవారం ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. వందల మంది విద్యార్థులు దవాఖానల పాలు కాగా, పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ ఆహారం విద్యార్థులకు పెడి తే అరెస్టులు చేస్తామని సీఎం ప్రకటించినా ఎకడ వేసిన గొంగళి అకడే అన్న చందంగా మారిందని, రేవంత్ మాటలు కోటలు దాటితే, ఆచరణ గడప దాటదు అనేందుకు గురుకులాల దీనస్థితే నిదర్శనమని మండిపడ్డారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని, ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగకుండా చర్య లు తీసుకోవాలని డిమాండ్ చేశారు.