Edupayala Temple | మెదక్ : జిల్లా పరిధిలోని ఏడుపాయల దేవాలయంలో భారీ చోరీ జరిగింది. గర్భ గుడి ముందున్న 2 హుండీలను శుక్రవారం రాత్రి దొంగలు అపహరించారు. శనివారం తెల్లవారుజామున ఆలయం వద్దకు చేరుకున్న పూజారులు.. హుండీలు మాయమైన దృశ్యాన్ని గమనించారు. దీంతో పూజారులు పోలీసులకు సమాచారం అందించారు.
ఏడుపాయల ఆలయం వద్దకు చేరుకున్న పోలీసులు.. పరిసర ప్రాంతాలను పరిశీలించగా, పాత కల్యాణకట్ట వద్ద హుండీలు కనిపించాయి. రెండు హుండీలను ధ్వంసం చేసి నగదు, విలువైన కానుకలను దొంగలు అపహరించిన ఆనవాళ్లు ఉన్నాయి. పది రోజుల క్రితమే ఆలయంలోని హుండీలను సిబ్బంది లెక్కించారు. ఈ చోరీ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పాపన్నపేట పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఏడుపాయల వన దుర్గ ఆలయంలో హుండీలను చోరీ చేసిన దొంగలు
మెదక్ – ఏడుపాయల వన దుర్గ ఆలయం పాత కల్యాణ కట్ట గర్భగుడి వద్ద ఉన్న రెండు హుండీలను ధ్వంసం చేసి నగదు ఎత్తుకెళ్లిన దొంగలు.
కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న పోలీసులు pic.twitter.com/2C3QJLKndF
— Telugu Scribe (@TeluguScribe) August 10, 2024
ఇవి కూడా చదవండి..
Zoetis Inc | హైదరాబాద్లో కేపబులిటీ సెంటర్ను విస్తరించనున్న జొయిటిస్.. వందలాది మందికి ఉద్యోగాలు
Karimnagar | మెట్పల్లిలో పోలీసుల అత్యుత్సాహం.. మహిళపై లాఠీ ఝులిపించారు.. వీడియో