New Bars Application | బార్ల కోసం భారీగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. జీహెచ్ఎంసీలోని 24 బార్లకు 3520 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలోని నాలుగు బార్లకు 148 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. దరఖాస్తులతో ఎక్సైజ్ శాఖకు రూ.36.68 కోట్ల ఆదాయం సమకూరింది. పొజిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ సీ హరి కిరణ్ జీహెచ్ఎంసీ పరిధిలోని 24 బార్లకు మిగిలిన జిల్లాల్లో నాలుగు బార్లకు దరఖాస్తులకు స్వీకరణకు నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం 28 బార్లకు 3668 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల చివరి తేదీ ఈ నెల 6 వరకు దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తులు ఇవ్వడానికి ఔత్సాహికులు పోటీపడ్డారు. జీహెచ్ఎంసీ పరిధిలో 24 బార్లకు 3520 దరఖాస్తులు వచ్చాయి. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాలో నాలుగు బాస్టులకు 148 దరఖాస్తులు వచ్చాయి.
28 బార్లకు దరఖాస్తుల ద్వారా ఎక్సైజ్ శాఖకు రూ.36.68 కోట్ల ఆదాయం వచ్చింది. జీహెచ్ఎంసీ పరిధిలోని 24 బార్లకు వచ్చిన దరఖాస్తులను ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ లాటరీ ద్వారా బార్ల యజమానులను ఎంపిక చేయనున్నారు. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ జల్పల్లి మున్సిపాలిటీలో బారుకు 57 దరఖాస్తులు, మహబూబ్‌నగర్‌లో 49, నిజామాబాద్‌లో 27, నిజామాబాద్ జిల్లా బోధనలో 15 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలోని బార్లకు ఆయా జిల్లా కలెక్టర్లు లాటరీ విధానంలో బార్ యజమానులను ఎంపిక చేస్తారు. ఈ నెల 3న బార్లకు డ్రా పద్ధతి ద్వారా బార్ హోల్డర్స్‌ను ఎంపిక చేయనున్నారు. లాటరీ ఎక్కడ నిర్వహిస్తారనే విషయం ఒకటి రెండురోజుల్లో తెలియజేయనున్నట్లు రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ పీ దశరథ్ వివరించారు.