ఖమ్మం : లగచర్ల ఫార్మా కంపెనీలో భూములు కోల్పోయి, అక్రమ కేసులో ఇరుక్కున్న బాధితులకు సంఘీభావంగా ఖమ్మంలో(Khammam) బీఆర్ఎస్ పార్టీ( BRS party) భారీ ర్యాలీ నిర్వహించింది. రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. భూసేకరణ పేరుతో బలవంతంగా గిరిజన రైతుల భూములు లాక్కోడానికి తప్పు పట్టింది.
ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ నుంచి జడ్పీ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ వద్దురాజ రవిచంద్ర, ఎమ్మెల్సీ తాత మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు, డిసిసిబి మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, గిరిజన రైతులు పాల్గొన్నారు.