హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను రేవంత్రెడ్డి సర్కార్ ఏడాదిగా అవమానిస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ ధ్వజమెత్తింది. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చెరిపేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్రెడ్డి, కేసీఆర్ నిర్మించారనే కారణంతోనే హైదరాబాద్లో భారీ అంబేద్కర్ విగ్రహ ప్రాంగణానికి తాళాలతో సంకెళ్లు వేయించారని విమర్శించింది. సర్కార్ తీరుకు ని రసనగా శుక్రవారం ఉదయం 10 గంటలకు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద పూలు చల్లి నివాళులు అర్పించనున్నట్టు బీఆర్ఎస్ ప్రకటించింది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు శుక్రవారం ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్కు చేరుకొని అక్కడి నుంచి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించాలని పిలుపునిచ్చింది. రాజ్యాంగాన్ని తుంగ లో తొకుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూ నీ చేస్తున్న రేవంత్రెడ్డి నుంచి రాష్ర్టాన్ని కాపాడాలని కోరుతూ అంబేదర్ సా క్షిగా తెలంగాణ సమాజానికి తెలిసేలా తాము ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు బీఆర్ఎస్ ప్రకటించింది.