హైదరాబాద్, మే 11(నమస్తే తెలంగాణ): ఇసుక విక్రయ విధానాన్ని మెరుగుపర్చడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఆదాయాన్ని గణనీయంగా పెంచుకున్నది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అక్రమాలకు చెక్‌పెట్టడం, సరసమైన ధరలో వినియోగదారుడికి తక్కువ సమయంలోనే ఇసుకను సమకూర్చడం ద్వారా గత ఎనిమిదేండ్లలో రూ.5,551.32 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నది. అంతకుముందు ఏడేండ్లలో (2007-14 మధ్యకాలంలో) ఈ ఆదాయం రూ. 39.66 కోట్లు మాత్రమే. అయినా రాష్ట్ర ఆదాయానికి గండిపడుతున్నదని విపక్షాలు ఆరోపించడం విడ్డూరంగా ఉన్నది.
స్వరాష్ట్ర ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ప్రగతిశీల విధానాల వల్ల తెలంగాణలో నిర్మాణరంగం గతంలో ఎన్నడూ లేనివిధంగా ఊపందుకున్నది. ప్రత్యేకించి హైదరాబాద్‌లో ఎవరూ ఊహించనంత ప్రగతి నమోదైంది. దీంతో దేశంలోని అన్ని రాష్ర్టాల నుంచి తెలంగాణకు వలసలు గణనీయంగా పెరిగాయి. ఇసుక విక్రయాలు పారదర్శకంగా చూసేందుకు ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టడంతో ఆదాయం పక్కదారి పట్టకుండా ఖజానాకు చేరుతున్నది.
రోబో శాండ్ విక్రయాలు పెరిగినా..
వాస్తవానికి రాష్ట్రంలో గత పదేండ్ల నుంచి రోబో శాండ్ (రాక్ శాండ్) విక్రయాలు భారీగా పెరిగాయి. బడా ప్రాజక్టులన్నీ దాదాపు రోబో శాండ్తోనే నిర్మిస్తున్నారు. దీంతో రివర్ శాండ్ (నది నుంచి తెచ్చే ఇసుక) విక్రయాలపై గణనీయ ప్రభావం పడుతున్నది. అయినా రివర్ శాండ్ విక్రయాలు ఏటేటా పెరుగుతుండటంతో రాష్ట్ర ఖజానాకు దండిగా ఆదాయం వస్తున్నది.
Pppp