TS-iPASS | టీఎస్ ఐపాస్‌తో తెలంగాణకు భారీగా పెరిగిన ఇన్వెస్ట్మెంట్స్.. ఏడాదికి సగటున లక్షకు పైగా ఉద్యోగాలు
TS-iPASS | రాష్ట్ర ప్రభుత్వం 2014లో ప్రవేశపెట్టిన టీఎస్ ఐపాస్ పథకం (తెలంగాణ పారిశ్రామిక విధానం) విజయవంతంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నది. భారత్‌లో పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణ రాష్ట్రం మరోసారి తనపేరును సార్థకం చేసుకొన్నది. ముగిసిన 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ర్టానికి పెట్టుబడుల వరద పారింది.
TS-iPASS | హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం 2014లో ప్రవేశపెట్టిన టీఎస్ ఐపాస్ పథకం (తెలంగాణ పారిశ్రామిక విధానం) విజయవంతంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నది. భారత్‌లో పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణ రాష్ట్రం మరోసారి తనపేరును సార్థకం చేసుకొన్నది. ముగిసిన 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ర్టానికి పెట్టుబడుల వరద పారింది. నిరుడితో పోల్చుకొంటే 2022-23లో రాష్ర్టానికి దాదాపు మూడు రెట్లు అధికంగా పెట్టుబడులు సమకూరాయి.
తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు దిగ్గజ కంపెనీలు క్యూ కట్టాయి. టీఎస్ ఐపాస్ నివేదిక ప్రకారం.. 2021-22లో రాష్ట్రంలో 4,093 యూనిట్లు ఏర్పాటు కాగా, రూ. 18,893.28 కోట్లమేర పెట్టుబడులు వచ్చాయి. 2022-23లో రూ.49,579.18 కోట్ల పెట్టుబడులు రాగా.. 4,602 యూనిట్లు ఏర్పాటయ్యాయి. నిరుడు వచ్చిన యూనిట్లు అంతకుముందు ఏడాదితో పోల్చుకుంటే సుమారు 500 మాత్రమే ఎక్కువ అయినప్పటికీ.. పెట్టుబడులు మాత్రం రూ. 30 వేల కోట్లు అధికంగా రావడం విశేషం. 2021-22లో 10,1,035 ఉద్యోగావకాశాలు లభించగా, 2022-23లో 10,2,105కు పెరిగాయి. ప్రపంచంలోని ప్రముఖ కార్పొరేట్ సంస్థల నుంచి దేశీయ దిగ్గజ తయారీ సంస్థల వరకు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాయి. విభిన్న రంగాలకు చెందిన సంస్థలు రాష్ట్రంలో అడుగుపెట్టాయి. ఐటీతోపాటు ఆటోమొబైల్, వజ్రాభరణాలు, డిస్ప్లే ఫ్యాబ్, డాటా సెంటర్లు తదితర సంస్థలు ఇందులో ఉన్నాయి.
పెట్టుబడుల వివరాలు
- ప్రపంచ ఐటీ దిగ్గజం గూగుల్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న రెండో అతిపెద్ద క్యాంపస్ నిర్మాణానికి ఏప్రిల్ 2022లో మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. గూగు ల్ అమెరికా వెలుపల ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద క్యాంపస్ ఇదే కావడం విశేషం.
- అదే నెలలో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ బిలిటీ ఎలక్ట్రిక్ ప్రపంచంలోనే అతిపెద్ద మూడు చక్రాల వాహనాల తయారీ ఫ్యాక్టరీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది.
- జూన్‌లో గోల్డ్ రిటైలర్ రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్‌కు చెందిన ఎలెస్ట్ సంస్థ రూ.24 వేల కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో 6జీ ఏఎంఓఎల్‌ఈడీ డిస్ప్లే ఫ్యాబ్ ఏర్పాటునకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొన్నది. ఇది దేశంలోనే మొట్టమొదటి డిస్ప్లే ఫ్యాబ్ ఫెసిలిటీ కావడం విశేషం.
- దేశంలోనే బంగారం, వజ్రాభరణాల రిటైలర్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ రూ.750 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో ఆభరణాల తయారీ యూనిట్ ఏర్పాటునకు శంకుస్థాపన చేసింది. ఇందులో 2,750 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని సంస్థ ప్రకటించింది.
- ప్రముఖ బ్యాటరీ తయారీ సంస్థ అమరరాజా మహబూబ్‌నగర్ జిల్లాలో వచ్చే పదేండ్లలో రూ. 9,500 కోట్లతో భారీస్థాయిలో బ్యాటరీల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది.
- ఈ ఏడాది జనవరిలో ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ రూ.16 వేల కోట్లతో కొత్తగా మూడు డాటా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ డాటా కేంద్రాల సంఖ్య 6కు పెరగనున్నది.
- ప్రముఖ దుస్తుల తయారీ సంస్థ కిటెక్స్ రూ.3 వేల కోట్లతో వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు, రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్‌లో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చింది . వరంగల్‌లో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమ మరో ఆరు నెలల్లో ఉత్పత్తి ప్రారంభించనున్నది
- రూ.1200 కోట్లతో ఫ్రాన్స్‌కు చెందిన విమానయాన ఉత్పత్తుల దిగ్గజం శాఫ్రాన్ మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్ (ఎమ్మార్వో) కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొన్నది. వెయ్యి మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నది. ఇప్పటికే శాఫ్రాన్.. శంషాబాద్‌లోని జీఎంఆర్ ఏరోస్పేస్ పార్కులో శాఫ్రాన్ ఎలక్ట్రికల్ అండ్ పవర్ ఫ్యాక్టరీ, శాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్స్ ఫ్యాక్టరీలను నెలకొల్పింది.
- అమెరికాకు చెందిన అజ్యూర్ పవర్ గ్లోబల్ లిమిటెడ్ భాగస్వామ్యంతో మన దేశానికి చెందిన ప్రీమియర్ ఎనర్జీస్ గ్రూపు రూ. 4వేల కోట్లతో రాష్ట్రంలో సోలార్ సెల్స్, సోలార్ మాడ్యూల్స్ తయారీ సంస్థను విస్తరించనున్నది.
- సౌత్ కొరియాకు చెందిన బహుళజాతి ఆటోమోటివ్ దిగ్గజం హ్యుండాయ్ రాష్ట్రంలో రూ.1400 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్న మొబిలిటీ క్లస్టర్లో రూ.1400 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు కంపెనీ ప్రకటించింది.
- స్విట్జర్లాండ్‌కు చెందిన సంస్థ స్టాడ్లర్ రైల్ రాష్ట్రంలో నూతనంగా రైల్ కోచ్‌లను తయారుచేసే ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఇటీవల దావోస్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో కంపెనీ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకొన్నది.
తెలంగాణకు అనుకూలిస్తున్న అంశాలు
- ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లలో మూడింట ఒక వంతు వ్యాక్సిన్ల ఉత్పత్తి.
- దేశ సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో 16 శాతం మన రాష్ట్రం నుంచే ఎగుమతికావడం.
- రాష్ట్రంలో 53 ఐటీ సెజ్‌ల కార్యకలాపాలు. దేశంలోనే అతిపెద్ద ఐటీ క్లస్టర్.
- దేశీయ ఔషధ ఉత్పత్తుల్లో ఐదింట రెండు వంతులు మనవే.
- దేశీయ రక్షణ రంగ ఉత్పత్తుల్లో ఐదింట రెండు వంతులు మనవే.
- యాపిల్, అమెజాన్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, ఉబెర్, గూగుల్, క్వాల్కామ్ తదితర ప్రఖ్యాత అంతర్జాతీయ కంపెనీల రెండో అతిపెద్ద కార్యాలయాలు మన రాష్ట్రంలోనే ఏర్పాటు చేయడం.
- దేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద ఆర్అండ్డీ, బయోటెక్నాలజీ క్లస్టర్ అయిన జీనోమ్ వ్యాలీ.
- రక్షణ రంగ బహుళ ఉత్పత్తుల ఏరోస్పేస్ సెజ్.
- శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్ద ఆదిభట్లలో ఏర్పాటు చేసిన దేశంలోనే ఏకైక రక్షణ రంగ బహుళ ఉత్పత్తుల సెజ్
- హైటెక్‌సిటీ, గచ్చిబౌలీ చుట్టూ ఐటీ, ఐటీ అనుబంధ సేవల క్లస్టర్ విస్తరణ.
పెట్టుబడులకు ముందుకొచ్చిన మరికొన్ని బహుళజాతి సంస్థలు
నికోమాక్ తైకిషా క్లీన్రూమ్స్ (జపాన్), దైఫూకు (జపాన్), పేజ్ ఇండస్ట్రీస్(జాకీ బ్రాండ్), జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ (జీఈఎఫ్) (ఫ్రీడం ఆయిల్), ష్నీడర్ ఎలక్ట్రిక్ (ఫ్రాన్స్), మ్యాన్‌కైండ్ కన్జ్యూమర్ హెల్త్‌కేర్, 3ఎఫ్, రవి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్ఎఫ్పీఎల్), ప్రీమియర్ ఎనర్జీస్, వెమ్ టెక్నాలజీస్, ఆశీర్వాద్ పైప్స్ (అలియాక్సిస్ గ్రూపు), ఫెర్రింగ్ ఫార్మా (స్విట్జర్లాండ్), ఈఎంపీఈ (స్వీడన్), భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ లిమిటెడ్ (బీఎస్వీ), ఎస్3వీ వాస్కులర్ టెక్నాలజీస్, ఎంఆర్ఎఫ్, అడ్వాన్స్ ఆటోపార్ట్స్, జాంప్ ఫార్మాస్యూటికల్స్ (కెనడా), సహజానంద్, థర్మో ఫిషర్, డ్రిల్మెక్ (ఇటలీ), వెల్స్పన్ ఫ్లోరింగ్, వెల్స్పన్ అడ్వాన్స్ మెటీరియల్స్, ఒలెక్ట్రా గ్రీన్‌టెక్, హిందుస్థాన్ కోకాకోలా, ప్లాంట్ లిపిడ్స్, పల్స్ ఫార్మా, అదానీ డిఫెన్స్, యంగ్వన్, గణేషా ఎకోస్పేర్.

ప్రపంచ ఐటీ దిగ్గజం గూగుల్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న రెండో అతిపెద్ద క్యాంపస్ నిర్మాణానికి ఏప్రిల్ 2022న మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఇలా పదుల సంఖ్యలో ప్రపంచ స్థాయి సంస్థలకు సెకండ్ క్యాంపస్ హైదరాబాదే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

