యాదగిరిగుట్ట: నరసింహస్వామి జయంతి మహోత్సవం సందర్భంగా యాదగిరిగుట్ట (Yadagirigutta) ఆలయంలో గిరిప్రదక్షిణ నిర్వహించారు. ఆలయ ఈవో వెంకట్రావ్ ఆధ్వర్యంలో నిర్విహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, ఆధ్యాత్మిక సంస్థలకు చెందినవారు భారీగా పాల్గొన్నారు. కొండ చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత.. కొండపైకి చేరుకుని లక్ష్మినరసింహ స్వామివారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు.