వైభవంగా కొమురవెల్లి మల్లన్న పెద్దపట్నం
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి (Komuravelli Mallanna) క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి సందర్భంగా మల్లన్న ఆలయంలో పెద్దపట్నం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.
సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి (Komuravelli Mallanna) క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి సందర్భంగా మల్లన్న ఆలయంలో పెద్దపట్నం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. దీంతో ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఒగ్గు పూజారులు స్వామివారి కల్యాణోత్సవాన్ని స్తుతిస్తూ పెద్దపట్నం కార్యక్రమం రాత్రి 12 గంటలకు ప్రారంభించి.. వేకువఝాము వరకు కొనసాగించారు. ఆలయ అర్చకులు స్వామి వారి ఉత్సవ విగ్రహాలను తీసుకువచ్చి పట్నం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారు పట్నం దాటిన అనంతరం భక్తులు మల్లన్నను దర్శించుకున్నారు. పంచవర్ణాలతో వేసిన పెద్దపట్నాన్ని దాటేందుకు భక్తులు పోటీపడ్డారు.

ఆలయంలో అర్చన, కల్యాణ మండపం వద్ద ఒగ్గుపూజారుల పట్నం ఒకేసారి కొనసాగుతాయి. మల్లన్నను స్తుతిస్తూ స్వామివారి చరిత్రను ఒగ్గు కథ రూపంలో చెప్పారు. ఒగ్గు కథ చెబుతూ పూజారులు ఐదు రంగులతో పెద్దపట్నం వేస్తారు. అది పూర్తికాగానే ముందుగా పట్నంలోకి బోనాన్ని తర్వాత స్వామివారి ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి పూజలు నిర్వహించారు.

అనంతరం భక్తులు మల్లన్న నామస్మరణ చేస్తూ పట్నంపైకి దాటారు. పంచరంగుల చూర్ణాన్ని తీసుకెళ్లేందుకు భక్తులు పోటీపడ్డారు. అనంతరం నల్లపోచమ్మ, కొండపోచమ్మ ఆలయాలకు వెళ్లి అక్కడ అమ్మవార్లకు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులు భారీగా సంఖ్యలో తరలిరావడంతో ఉత్సవాల్లో ఎలాంటి అవంఛానీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.





Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

