భక్తజన సంద్రంగా యాదగిరిగుట్ట
యాదగిరీశుడి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి ప్రాంగణంలో భక్తుల రద్దీ కనిపించింది. భక్తులతో సత్యనారాయణ స్వామి వ్రతమండపం, మాడ వీధులు, ప్రసాద విక్రయశాల, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు సందడిగా మారాయి
యాదాద్రి, డిసెంబర్ 18 : యాదగిరీశుడి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి ప్రాంగణంలో భక్తుల రద్దీ కనిపించింది. భక్తులతో సత్యనారాయణ స్వామి వ్రతమండపం, మాడ వీధులు, ప్రసాద విక్రయశాల, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు సందడిగా మారాయి. ధర్మదర్శనానికి దాదాపు 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు.
తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు స్వామివారి దర్శనాలు కొనసాగాయి. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా గోదాదేవి రంగనాయకస్వామి రచించిన పాశురాలను పఠించారు. సుమారు 38 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, ఖజానాకు రూ.47,71,692 ఆదాయం సమకూరినట్టు ఆలయ ఈవో గీత తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

