Congress | హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభుత్వ ఆనవాళ్లను చెరిపివేసే క్రమంలో ప్రభుత్వ పథకాల్లో భారీగా మార్పులు, చేర్పులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాల్లో కొన్నింటిని పూర్తిగా తొలగించాలని, మరికొన్నింటి పేర్లు మార్చి ‘కాంగ్రెస్’ మార్కు చూపెట్టాలని నిర్ణయించింది. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, హస్తం పేర్లు కలిసొచ్చేలా పథకాల పేర్లను మార్చనున్నట్టు తెలిసింది.
ఈ మేరకు ఇప్పటికే ఆయా పథకాల జాబితాను అన్ని శాఖలు సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది. ఇప్పటికే కొన్ని పథకాలను అంతర్గతంగా కొత్త పేర్లతో పిలుచుకుంటున్నారని, ఎన్నికల కోడ్ పూర్తయ్యాక అధికారికంగా ఉత్తర్వులు జారీ అవుతాయని చెప్తున్నారు. రద్దు చేయబోయే పథకాలనూ అధికారికంగా వెల్లడించే అవకాశం ఉన్నది.