ముషీరాబాద్, నవంబర్ 4: పారిశుధ్య కార్మికులకు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో ప్రాధ్యాన్యం కల్పించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపలి శ్రీనివాస్ మాదిగ డిమాండ్ చేశారు. 9న పారిశుధ్య కార్మికుల హక్కుల సాధనకు భవిష్యత్ కార్యాచరణ ప్రటించనున్నట్టు వెల్లడించారు. సోమవారం విద్యానగర్లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ..
రాష్ట్రంలో నూటికి 80 శాతం దళిత పేద వర్గాలు పారిశుధ్య కార్మికులుగా పని చేస్తున్నారని, వారు కనీస వసతుల లేక జీవనం కొనసాగిస్తున్నారని వాపోయారు. కాంగ్రెస్ ప్రజా పాలనలో పారిశుధ్య కార్మికుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయని ఆరోపించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు అంజన్న, నరేశ్, శ్యామ్రావు, వరిగడ్డి చందు, తిరుమలేశ్, జన్నారపు జీవన్, శ్రీకాంత్, సురేశ్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.