వాంకిడి : మండలంలోని బంబార గ్రామ పంచాయితీ బారేగూడలో మంగళ వారం రాత్రి (House burnt) గ్రామానికి చెందిన వాడై దేవాజీ ఇల్లు అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధమయ్యింది. ఫైర్ ఇంజన్ ( Fire Engine ) ఘటన స్థలానికి చేరుకొనే లోపు ఇల్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యింది. పత్తి పంట అమ్మిన డబ్బులు( Cash) , నగలు, నిత్యావసర సరుకులు మంటల్లో కాలిపోయాయని, కట్టు బట్టలతో రోడ్డుపై పడ్డామని బాధితుడు దేవాజీ దంపతులు పేర్కొన్నారు.
ఘటన విషయం తెలుసుకున్న ఆర్ఐ మాజీద్ (RI Majeed ) ఘటన స్థలానికి చేరుకొని జరిగిన ప్రమాదం గురించి బాధ్యత కుటుంబాన్ని అడిగి తెలుసుకుని పంచనామా నిర్వహించారు. దాదాపు రూ. 21 లక్షలు ఆస్తి నష్టం జరిగిందని వివరించారు. ప్రభుత్వం తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా ఆర్ ఐ మాట్లాడుతూ జరిగిన సంఘటన పర్యవేక్షణ పంచనామా విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకు వెళ్తానన్నారు.