హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ) : వానకాలం సీజన్లో ఉద్యాన పంటలు భారీ వర్షాలకు దెబ్బతిన్నాయి. పెట్టిన పెట్టుబడులు కూడా వెళ్లని పరిస్థితి రైతులకు మిగిలింది. ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు కురిసిన భారీ వర్షాలతో కూరగాయలు, పండ్ల తో టలు దెబ్బతిన్నాయి. నిమ్మ, బత్తాయి వంటి పండ్ల తోటలకు చీడపీడలు, తెగులు సోకా యి. నిమ్మతోటలకు నత్తలు వ్యాపించాయి. ఫలితంగా దిగుబడులు తగ్గి ధరలు భారీగా పడిపోయాయి. టమాట, మిర్చి, బెండ, దొండవంటి తీగజాతి పంటలు పూర్తిగా మునిగిపోయాయి.
వర్షాలు తగ్గడంతో రైతులు యాసంగికి కొత్త పంటలు వేసేందుకు సమాయత్తం అవుతున్నారు. నవంబర్ మొదటి వారంతోనే ఉద్యాన పంటల సాగు మొదలవుతాయి. ఉద్యానశాఖ, ఉద్యాన విశ్వవిద్యాలయంతో సంప్రదించి ఈసీజన్కు అవసరమైన కార్యాచరణను జిల్లాల వారీగా ప్రకటించాల్సి ఉంది. రైతులకు అవసరమైన విత్తనాలు, సలహాలు, సూచనలు అందించేందుకు ఉద్యానశాఖ అక్టోబర్ చివరి వారంలోనే ఉద్యాన ప్రణాళిక ప్రకటించాల్సి ఉంటుంది. కానీ ఆదిశగా ఉద్యానశాఖ చర్యలు ప్రారంభించకపోవడంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): విద్యాశాఖ ఇన్చార్జి కార్యదర్శి ఏ దేవసేనను ఉద్దేశించి ఇటీవల తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల సంఘాల సమాఖ్య(ఎఫ్ఏటీహెచ్ఐ) చేసిన ఆరోపణలను ఐఏఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ నిరాధార ఆరోపణలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ఎటువంటి ఆధారాలు లేకుండా అధికారులపై ఆరోపణలు చేయడం సరికాదని సంఘం అధ్యక్షుడు రామకృష్ణారావు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. వ్యక్తిగత ఆరోపణ లు, అధికారిని అవమానించే విధంగా చేసిన బహిరంగ వ్యాఖ్యలు ఆమె గౌరవాన్ని, నైతిక ైస్థెర్యాన్ని దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. ఆమెపై చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవని, ఆమోదయోగ్యం కానివని ఐఏఎస్ అధికారుల సంఘం తెలిపింది.