సర్కారు బడులకు గృహ విద్యుత్తు కనెక్షన్లు!
రాష్ట్రంలోని సర్కారు బడులకు త్వరలో విద్యుత్తు బిల్లుల భారం తప్పనున్నది. బడుల విద్యుత్తు కనెక్షన్లను కమర్షియల్ క్యాటగిరీ నుంచి డొమెస్టిక్ క్యాటగిరీకి ప్రభుత్వ మార్చనున్నది.
- ప్రస్తుతం కమర్షియల్ కనెక్షన్లు
- త్వరలోనే క్యాటగిరీ మార్చే అవకాశం
- తగ్గనున్న బిల్లుల భారం
హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని సర్కారు బడులకు త్వరలో విద్యుత్తు బిల్లుల భారం తప్పనున్నది. బడుల విద్యుత్తు కనెక్షన్లను కమర్షియల్ క్యాటగిరీ నుంచి డొమెస్టిక్ క్యాటగిరీకి ప్రభుత్వ మార్చనున్నది. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే మౌఖిక ఆదేశాలివ్వగా, త్వరలో పూర్తిస్తాయి అమలుకు విద్యాశాఖ అధికారులు సన్నాహకాలు చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం రాష్ట్రంలో 26,074 బడులుండగా, వీటిల్లో 24,084 బడులకు విద్యుత్తు కనెక్షన్లున్నాయి. మరో 1,990 బడులకు ఇప్పటివరకు కరెంట్ కనెక్షన్లు లేవు. ఇటీవలికాలంలో విద్యుత్తు ఉపకరణాల వినియోగం పెరగడంతో బడులకు విద్యుత్తు బిల్లులు అమాంతం పెరుగుతున్నాయి. కంప్యూటర్ ల్యాబ్లు, ప్రయోగశాలలు, బోర్మోటర్లకు విద్యుత్తు వినియోగంతో బిల్లులు తలకుమించిన భారంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విద్యుత్తు కనెక్షన్ల క్యాటగిరీని మార్చాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. గృహజ్యోతి పథకంలో వర్తింపజేసే 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇదే అంశంపై ఇటీవలే సీఎం రేవంత్రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. గృహ క్యాటగిరీకి మార్చేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు.
కొన్ని బడుల గత బిల్లులు..పాఠశాల బిల్లు మొత్తం
- జెడ్పీహెచ్ఎస్ శామీర్పేట రూ.8106
- ఎంపీపీఎస్ జవహార్నగర్ రూ.1139
- జెడ్పీహెచ్ఎస్ బాలానగర్ రూ.3000
- ఎంపీపీఎస్ బాచుపల్లి రూ.1300
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

