Cyclone Michaung | తుఫాను ప్రభావం.. ఈ జిల్లాలో పాఠశాలలకు సెలవు..!
Cyclone Michaung | మిగ్జాం తుఫాను ప్రభావంతో తమిళనాడు, ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, తెలంగాణలోనూ తుఫాను ప్రభావంతో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
Cyclone Michaung | మిగ్జాం తుఫాను ప్రభావంతో తమిళనాడు, ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, తెలంగాణలోనూ తుఫాను ప్రభావంతో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని విద్యాసంస్థలకు రేపు (బుధవారం) జిల్లా అధికార యంత్రాంగం సెలవు ఇచ్చింది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలన్నీ మూసే ఉంచాలని జిల్లా విద్యాధికారి ఆదేశించారు.
భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. తప్పనిసరిగా బుధవారం పాఠశాలల్లో తరగతులు నిర్వహించొద్దని స్పష్టం చేశారు. హాస్టల్లో ఉండే విద్యార్థిలు బయటకు రావొద్దని.. హాస్టల్స్‌లోనే ఉండాలన్నారు. మిగ్జాం తుఫాను ప్రభావంతో బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. మరో వైపు మంగళవారం భద్రాద్రి కొత్తగూడెంలో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా అశ్వారావుపేటలో 14 సెంటీమీటర్ల వర్షాపాతం రికార్డయ్యింది. అలాగే దమ్మపేటలో ఎనిమిది సెంటీమీటర్ల వరకు వర్షాపాతం నమోదైంది. అలాగే, పలుమండల్లాలో మోస్తరు వర్షాలు కురిశాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

