Telangana | హైదరాబాద్ : రాష్ట్ర సచివాలయంలో పని చేసే మహిళా ఉద్యోగులకు శుభవార్త. కార్తీక వన భోజనాల నిమిత్తం మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. యాదాద్రిలో జరిగే కార్తీక వన భోజనాల కోసం సచివాలయంలోని మహిళా ఉద్యోగులకు ఈ నెల 18న సగం రోజు సాధారణ సెలవుగా ప్రకటించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఈ ఆర్డర్ ఈ నెల 17వ తేదీన జారీ చేసినట్లు ఉంది. ప్రస్తుతం ఈ ఉత్తర్వు నెట్టింట వైరల్ అవుతోంది.
