బచ్చన్నపేట, మే 3: . బుధవారం ఆయన కొన్నె గుట్టను సందర్శించారు. జనగామ జిల్లాలోని ప్రతి రెండు గ్రామాల మధ్య ఒక బృహత్ శిలాయుగం నాటి శ్మశానవాటిక, శాతవాహన కాలం నాటి ఆవాస ప్రాంతాలు అనేకం ఉన్నాయని తెలిపారు. గూడూరు, తాటికొండ గ్రామాల్లో బౌద్ధ చారిత్రక ఆధారాలు కన్పిస్తున్నాయని చెప్పారు. అందులో భాగంగానే కొన్నె గజగిరిగుట్ట దిగువన పాడిగడ్డ మట్టిదిబ్బల కింద శాతవాహనుల కాలం నాటి ఇటు క గోడల నిర్మాణాలు గుర్తించామని చెప్పారు.
బౌద్ధ స్తూప నిర్మాణానికి సంబంధించిన శిలలు, సున్నపు రాయి, ఇటుక గోడలు వెలుగు చూస్తున్నాయని చెప్పారు. శాతవాహనుల కాలం నాటి మట్టితో తయారుచేసిన టైల్స్ భారీ స్థాయిలో కన్పించాయని అన్నారు. గుట్ట పైభాగంలో బౌద్ధ స్తూపం ఉన్నదని దాని చుట్టూ కొండవాలు అంచును భిక్షకులు పడిపోకుండా ఉండటానికి వీలుగా రాతి వరుస ఉన్నదని తెలిపారు. కొన్నె, రామచంద్రాపూర్ గ్రామాల మధ్య సుమారు 2 వేల సమాధులు ఉన్నట్టు ఆయన వెల్లడించారు. నిలువురాళ్ల సమాధులు, గూడు సమాధులు, రంధ్రం ఉన్న గూడు సమాధులు, గుంత సమాధులు, రాక్షస గూళ్లు, డోల్మెన్ సమాధులతోపాటు కుండ సమాధులు ఉన్నాయని అన్నారు.