నిర్మల్, ఫిబ్రవరి 24: గిరిజనుల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు సంత్ సేవాలాల్ అని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని దివ్య గార్డెన్ లో సేవాలాల్ 283వ జయంతి ఉత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు.
సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రిమాట్లాడుతూ..గిరిజనుల అభివృద్ధి కోసం సేవాలాల్ చేసిన కృషి మరువలేనిదన్నారు. అదేవిధంగా సేవాలాల్ ప్రజల మేలు కోసం అనేక ఉద్యమాలు చేశారని, ఆయన సేవలను కొనియాడారు.
నిర్మల్లో సేవాలాల్ మందిర నిర్మాణానికి ప్రభుత్వం రూ. 50 లక్షలు మంజూరు చేసిందని తెలిపారు. అనంతరం సేవాలాల్ మందిర నిర్మాణానికి మంత్రి భూమిపూజ పూజ చేశారు. సేవాలాల్ జగదాంబ మాత ఆలయాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసి అభివృద్ధి చేస్తుందన్నారు.