యాదాద్రి/భద్రాచలం/ఎర్రుపాలెం, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాలను మూసివేశారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంతోపాటు అనుబంధ పాతగుట్ట, ఉపాలయాలను మంగళవారం అర్చకులు, అధికారులు ద్వార బంధనం చేశారు. తిరిగి రాత్రి 8 గంటలకు ఆలయాన్ని తెరిచిన అర్చకులు.. సంప్రోక్షణ, శుద్ధి పూజలు చేసి నిత్య కైంకర్యాలను ప్రారంభించారు.
భద్రాచలం సీతారామచంద్రస్వామివారి ఆలయాన్ని అధికారులు, అర్చకులు మూసేశారు. గ్రహణానంతరం రాత్రి 7 గంటలకు తలుపులు తెరిచి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, శాంతి హోమం నిర్వహించారు. శ్రీశైల ప్రధానాలయంతోపాటు పరివార దేవతాలయాల్లో గ్రహణ విడుపు కాలం తర్వాత శాస్ర్తోక్తంగా ఆలయ శుద్ధి జరిపించా రు. చంద్రగ్రహణం నేపథ్యంలో బాసర సరస్వతీ ఆలయాన్ని అర్చకులు మూసేశారు.