హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : విద్యార్థుల ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంలో భాగంగా ఉన్నత విద్యామండలి కీలక అడుగేసింది. ఇంటర్న్‌షిప్‌లకు శ్రీకారం చుట్టింది. తొలి విడతలో 15 మంది అమ్మాయిలను ఇంటర్న్‌లుగా ఎంపికచేసింది. ఆంధ్ర మహిళా సభ కాలేజ్ ఫర్ ఉమెన్‌కు చెందిన 15 అమ్మాయిలను ఎంపికచేసినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి తెలిపారు.
ఇంటర్న్‌షిప్‌లతో ఉద్యోగ అవకాశాలకు కీలక అర్హతలుగా మారిన తరుణంలో మండలి వైపు నుంచి ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఇవి ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్లు పొందేందుకు దోహదపడుతాయన్నారు. భవిష్యత్తులోను మరికొందరు విద్యార్థులను ఇంటర్న్‌షిప్‌ల కోసం ఎంపికచేస్తామన్నారు.