BRSV Protest | విద్యారంగంలో సమస్యలపై బీఆర్ఎస్వీ ఆందోళన.. అసెంబ్లీ ఎదుట ఉద్రిక్తత
BRSV Protest | అసెంబ్లీ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ నాయకులు ఇవాళ అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ఫీజు రియింబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగాల భర్తీ చేపట్టాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ఎదుట ధర్నా చేపట్టారు
BRSV Protest | అసెంబ్లీ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ నాయకులు ఇవాళ అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ఫీజు రియింబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగాల భర్తీ చేపట్టాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో బీఆర్ఎస్వీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని, వాహనాల్లో నాంపల్లి, పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు.
విద్యారంగంపై సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న నిర్లక్ష్యపు ధోరణికి వ్యతిరేకంగా బీఆర్ఎస్వీ నాయకులు ఇవాళ అసెంబ్లీని ముట్టడించారు. ఫీజు రియింబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రెండున్నరేళ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు. విద్యారంగంపై సర్కార్కు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. నోటిఫికేషన్లు ఇవ్వకుండా, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా గోస పుచ్చుకుంటుందని కాంగ్రెస్ సర్కార్పై నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అసెంబ్లీ ఎదుట ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్వీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన బీఆర్ఎస్వీ నేతలను పంజాగుట్ట, నాంపల్లి పోలీస్ స్టేషన్లకు తరలించారు. విడతల వారీగా బీఆర్ఎస్వీ నాయకులు అసెంబ్లీ ముట్టడికి వస్తుండటంతో వారిని అడ్డుకోవడానికి పోలీసులకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో క్షుణ్నంగా తనిఖీలు చేపట్టారు.
విద్యా రంగంపై రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న నిర్లక్ష్యపు ధోరణికి వ్యతిరేకంగా అసెంబ్లీని ముట్టడించిన బీఆర్ఎస్వీ
నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్వీ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు pic.twitter.com/jIW28WslB7
— Telugu Scribe (@TeluguScribe) March 24, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

